హీరోగా రానున్న సాత్విక్ వర్మ!
- May 23, 2021
హైదరాబాద్: ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. ఇప్పుడీ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా అని దర్శకుడు శివ చెబుతున్నాడు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సాత్విక్ వర్మను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను ప్రారంభించామని, ఈ యేడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడలో 59 రోజులలో చిత్రీకరణ పూర్తి చేశామని నిర్మాత రమేశ్ చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల వివరాలను తెలియచేస్తామని అన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







