యాస్ తుఫానుపై ప్రధాని మోదీ సమీక్ష..
- May 23, 2021
న్యూ ఢిల్లీ: యాస్ తుఫాను సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కొంచెంసేపటి క్రితం వివిధ రంగాలకు చెందిన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ నుండి సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు, టెలికాం కార్యదర్శులు, విద్యుత్, పౌర విమానయానం, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖలతో పిఎం నరేంద్ర మోడీ సైక్లోన్ యాస్ తీవ్రతను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న సన్నాహాలను సమీక్షించారు. ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాస్ తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలంటూ మోదీ ఆయా మంత్రిత్వశాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మోదీ దిశానిర్ధేశం చేశారు.
కాగా, యాస్ తుఫానుపై క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ(NCMC) సమావేశం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. తూర్పున బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘యాస్’ తుఫాను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, ఏజెన్సీల సంసిద్ధతను ఎన్సీఎంసీ సమావేశంలో సమీక్షించింది. మే 26 సాయంత్రానికి యాస్ తుపాను పశ్చిమ బెంగాల్, ప్రక్కనే ఉన్న ఉత్తర ఒడిశా రాష్ట్ర తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. తుపాను యొక్క తాజా స్థితి గురించి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ (IMD) ఈ కమిటీకి వివరించారు. యాస్ తుపాను గాలి వేగం 155 నుండి 165 కిలోమీటర్ల మేర ఉండవచ్చని.. దీంతో ఈ రాష్ట్రాల తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో కూడిన తుఫాను వర్షాలు సంభవించే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ వెల్లడించారు. తుఫాను ఎదుర్కోవటానికి సన్నాహక చర్యల గురించి సంబంధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కమిటీకి వివరించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







