దుబాయ్‌ సూపర్‌ సేల్‌: 90 శాతం డిస్కౌంట్‌

- May 23, 2021 , by Maagulf
దుబాయ్‌ సూపర్‌ సేల్‌: 90 శాతం డిస్కౌంట్‌

దుబాయ్‌: 2021 లో మొదటి ఎడిషన్‌ 3 రోజుల సూపర్‌ సేల్‌ (3డిఎస్ఎస్‌), ఈ వీకెండ్‌లో షాపింగ్‌ ప్రియుల్ని అలరించనుంది.మే 27(గురువారం) నుంచి మే 29(శనివారం) వరకు షాపింగ్‌ చేసేవారికి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో ఫ్యాషన్‌, బ్యూటీ, గోల్డ్‌, హోమ్‌ ఎలక్ట్రానిక్స్‌ మరియు జ్యుయెలరీ ఐటమ్స్‌ దుబాయ్‌లోని పలు మాల్స్‌లో లభ్యమవుతాయి. ఈ ఈవెంట్‌ 500కి పైగా బ్రాండ్స్‌తో సందర్శకుల్ని 1,500కి పైగా ఔట్‌లెట్స్‌లో ఆహకర్షించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటెయిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సీఈఓ అహ్మద్‌ అల్‌ ఖాజా మాట్లాడుతూ మూడు రోజుల సూపర్‌ షో, రిటెయిల్‌ క్యాలెండర్‌లోనే ప్రత్యేకమైనదని చెప్పారు. తమ భాగస్వాములంతా ఈ కార్యక్రమంలో భాగమవుతున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. లిమిటెడ్‌ టైమ్‌లో క్యాష్‌బ్యాక్‌ అవకాశాల్ని కూడా షాపర్స్‌ సొంతం చేసుకోవాలని ఆయన కోరారు.మరిన్ని వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.
http://3daysupersale.com/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com