ఎలక్ట్రిక్ కార్ల ప్రొత్సహానికి ఫ్రీ పార్కింగ్, సలిక్ ట్యాగ్స్
- May 23, 2021
దుబాయ్: ఎలక్ట్రిక్ కార్ల ఓనర్లకు పలు ఆఫర్లు ప్రకటించింది దుబాయ్ ఆర్టీఏ. ఎలక్ట్రిక్ కార్ల ఓనర్లకు ఫ్రీ పార్కింగ్ స్లాట్స్ కేటాయించటంతో పాటు సలిక్ ట్యాగ్స్ ను కూడా ఇస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. దుబాయ్ గ్రీన్ మోబిలిటీ స్ట్రాటజీకి అనుగుణంగా పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రొత్సహించటంలో భాగంగా ఈ ఆఫర్లను ప్రకటించారు. దుబాయ్ లైసెన్స్ పొందిన ఎలక్ట్రిక్ కార్లను 2022 జులై వరకు దుబాయ్ లోని పలు పార్కింగ్ ప్రాంతాల్లో తొలి 4 గంటలు ఫ్రీగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్టీఏ దగ్గర ప్రత్యేక అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆటోమెటిగ్గా పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే దుబాయ్ పరిధిలోని 13 సలిక్ కస్టమర్ సర్వీస్ సెంటర్లలో వాహనాల రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా సలిక్ ట్యాగ్ ను పొందవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







