కోవిడ్ రూల్ బ్రేక్..950 మందిపై చట్టపరమైన చర్యలు
- May 23, 2021
దోహా: కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని ఖతార్ అధికారులు మరోసారి హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం అంటే చట్టవిరుద్ధ చర్యలకు పల్పడుతున్నట్లేనని స్పష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన ఖతార్ అధికారులు...తాజాగా మరో 961 మందిపై చర్యలు తీసుకుంది. ఇందులో 510 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, మరో 260 మంది భౌతిక దూరం పాటించలేదని వెల్లడించారు. పార్క్ లు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో గుమికూడినందుకు 180 మందిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు తెలిపారు. అలాగే ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని 9 మందితో పాటు హోం క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిన కేసులో ఒకరిని, పరిమితికి మించి వాహనంలో వెళ్లినందుకు మరొకరిపై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. కోవిడ్ నిబంధనలు అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వేల కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు స్పష్టం చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







