ఓటీటీ రిలీజ్ కు నో చెప్పిన హీరో
- May 24, 2021
యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న చిత్రం పాగల్. ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.లవ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు వచ్చాయట. అయితే విశ్వక్ సేన్ అండ్ మేకర్స్ మాత్రం ఓటీటీ విడుదలకు నో చెప్పారట. తొలుత ఓటీటీలోనే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్ . కానీ థియేటర్లలో విడుదల చేస్తే బిజినెస్ ఎక్కువగా ఉంటుందని విశ్వక్ సేన్ ఆలోచన మేరకు మేకర్స్..బిగ్ స్క్రీన్ పైనే సినిమాను చూపించాలని ఫిక్స్ అయినట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. థియేటర్లు రీఓపెన్ అయిన వెంటనే పాగల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







