2020లో 4,15,524 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- May 25, 2021
కువైట్ సిటీ: గత ఏడాదిలో కువైట్ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి అంతర్గత మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 4,15,524 ట్రాఫిక్ చలాన్లను ఇష్యూ చేసినట్లు వివరించింది. ఇందులో 2,57,636 మంది రెడ్ సిగ్నల్ జంప్ చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 64,090 మంది సీటు బెల్టులు ధరించలేదని, 6,855 మంది ర్యాష్ డ్రైవింగ్ చేయటంతో జరిమానాలు విధించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గ్లాస్ షేడింగ్ కొనసాగించిన మరో 57, 881 వాహనాలపై కూడా చలాన్లు వేసినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించే ప్రచారాలను చేపడుతున్నామన్నారు. అయినా కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని...అలాంటి వారిని గుర్తించి వెంటనే ఫైన్లు వేసేలా అన్ని గవర్నరేట్ల పరిధిలో తగిన ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







