కోవిడ్ శరణార్ధులకు స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' పోరి
- May 26, 2021
ఆపద సమయాల్లో తమ అభిమానులను ఆదుకోవటమే కాకుండా 'మేము సైతం' అంటూ తమ వంతు సాయం చేయటానికి ముందుకొస్తారు సినీతారలు. కోవిడ్ సమయంలో సోనూసూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆయన్ను ఒక రోల్ మోడల్ గా చేసేసింది. అదే కోవలో 'ఇస్మార్ట్ శంకర్' భామ నిధి అగర్వాల్ కూడా తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చింది.
నటి నిధి అగర్వాల్ 'డిస్ట్రిబ్యూట్ లవ్' అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించటానికి సన్నద్ధమవుతోంది. ఇది కోవిడ్ సంబంధిత అన్ని అవసరాలకు తీర్చే ఒక గమ్యస్థానంగా ఉండనుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు నటి తెలిపింది.
“నేను స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. దీనిని 'డిస్ట్రిబ్యూట్ లవ్' అని పిలుస్తాము. ఇది ముఖ్యంగా కోవిడ్ కోసం. ప్రజలు, కోవిడ్ సంబంధిత ప్రాధమిక అవసరాలు, మందులు లేదా వారికి అవసరమైనది ఏదైనా అభ్యర్థనలను ఈ వెబ్‌సైట్ లో తెలియజేస్తే, వారికి సాయం అందించేందుకు మా బృందం సిద్ధంగా ఉన్నారు." అని ఆమె మీడియాకు వివరించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







