ముంబై నుంచి దుబాయ్: ఎమిరేట్స్ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు

- May 26, 2021 , by Maagulf
ముంబై నుంచి దుబాయ్: ఎమిరేట్స్ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు

యూఏఈ: ముంబై నుంచి దుబాయ్.. విమానాన్ని ఎమిరేట్స్ సంస్థ ఇటీవల నడపగా, ఆ విమానంలో ఒకే ఒక్క ప్రయాణీకుడు వుండడం గమనార్హం. భారతదేశం నుంచి ప్రయాణీకుల్ని యూఏఈ తాత్కాలికంగా నిషేధించిన దరిమిలా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని ఎంపిక చేసిన గ్రూపులకు మాత్రమే వెసులుబాటు కల్పించారు. అలా వెసులుబాటు పొందినవాటిల్లో డిప్లమాటిక్ మిషన్స్, గోల్డెన్ వీసా కలిగినవారు, యూఏఈ జాతీయులు, యూఏఈ అథారిటీస్ అదనంగా వెసులుబాటు కల్పించిన వ్యక్తులు మాత్రమే ప్రస్తుతం ఇండియా నుంచి యూఏఈ వెళ్ళడానికి వీలుంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న స్టార్ జెమ్స్ గ్రూప్ సీఈఓ భవేష్ జవెరీ (గోల్డెన్ వీసా కలిగిన వ్యక్తి) మాత్రమే ఈ విమానంలో ఒంటరిగా ముంబై నుంచి దుబాయ్ ప్రయాణించారు. 909 దిర్హాములు వన్ వే టికెట్ ధరగా చెల్లించారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com