లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలి:సీపీ అంజనీకుమార్

- May 27, 2021 , by Maagulf
లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలి:సీపీ అంజనీకుమార్

హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం నార్త్‌జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీపీ మాట్లాడుతూ నార్త్‌జోన్ పరిధిలో ఎక్కువగా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయన్నారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఉందని తెలిపారు.ఫేక్ ఐడి కార్డ్స్ నకిలీ పాస్‌లు తీసుకుని రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5 వేల నుండి 6 వేల వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు.ఈరోజు నార్త్ జోన్‌లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని సీపీ అంజనీకుమార్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com