లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలి:సీపీ అంజనీకుమార్
- May 27, 2021
హైదరాబాద్: నగరంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. గురువారం నార్త్‌జోన్ పరిసర ప్రాంతాల్లో లాక్డౌన్ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీపీ మాట్లాడుతూ నార్త్‌జోన్ పరిధిలో ఎక్కువగా ఇతర జిల్లాల నుండి వాహనాలు వస్తున్నాయన్నారు. నార్త్ జోన్ పరిసర ప్రాంతాలలో మెడికల్ ఎమర్జెన్సీ ఎక్కువగా ఉందని తెలిపారు.ఫేక్ ఐడి కార్డ్స్ నకిలీ పాస్‌లు తీసుకుని రోడ్ల మీదకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 5 వేల నుండి 6 వేల వాహనాలు సీజ్ చేస్తున్నామన్నారు.ఈరోజు నార్త్ జోన్లో ఇప్పటికే 100 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలని సీపీ అంజనీకుమార్ కోరారు.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







