కువైట్: భారత ఎంబసీ వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లు
- May 28, 2021
కువైట్ సిటీ: కువైట్‌లోని ప్రవాసులకు ఎంబసీ సర్వీసులను మరింత సులువు చేసేందుకు భారత రాయబార కార్యాలయం వేర్వేరు సర్వీసులకు వేర్వేరు వాట్సాప్ నెంబర్లు తీసుకొచ్చింది. వేర్వేరు సేవల కోసం మొత్తం 12 వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను రాయబార కార్యాలయం ప్రకటించింది.వెంటనే ఈ నెంబర్లను భారత ప్రవాసులకు అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ప్రవాసులు ల్యాండ్‌లైన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్, నేరుగా కార్యాలయం సందర్శన ద్వారా రాయబార సర్వీసులు పొందుతుండగా, దీనికి అదనంగా ఈ వాట్సాప్ నెంబర్లు తీసుకొచ్చినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ నెంబర్ల ద్వారా ప్రవాసులు తమకు కావాల్సిన సర్వీసు కోసం పూర్తి వివరాలతో(పేరు, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్) ఎంబసీకి టెక్స్ట్ సందేశాలు పంపించవచ్చు.అయితే, ఈ నెంబర్లపై వాట్సాప్ కాల్ చేయడానికి లేదు. కేవలం సందేశాలు మాత్రమే పంపొచ్చు.అలాగే రాయబార కార్యాలయం అధికారిక పని వేళల్లో మాత్రమే ఈ నెంబర్లు పని చేస్తాయి.
- పాస్‌పోర్టు(సాధారణ సందేహాలు కాకుండా): కాన్సులర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501767
- వీసా, ఓసీఐ, అటెస్టేషన్, ఇతర సేవలు: కాన్సులర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501013
- హాస్పిటల్, అత్యవసర వైద్య సహాయం: కమ్యూనిటీ వెల్ఫేర్ వాట్సాప్ నెం.+965-65501587
- డెత్ రిజిస్ట్రేషన్: కమ్యూనిటీ వ్యవహారాలు వాట్సాప్ నెం.+965-65505246
- కువైట్‌లోని భారతీయ సంఘాలు: కమ్యూనిటీ వ్యవహారాలు వాట్సాప్ నెం.+965-65501078
- ఆడ గృహ కార్మికులు(వీసా 20): లేబర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501754
- కార్మిక (వీసా 14,18) & మగ గృహ కార్మికులు (వీసా 20): లేబర్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501769
- కమర్షియల్ అటెస్టేషన్: కామర్స్ వింగ్ వాట్సాప్ నెం.+965-65505097
- ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ (అధికారిక పని వేళలు ముగిసిన తర్వాత): అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాట్సాప్ నెం.+965-65501946
- పాస్‌పోర్టు (సాధారణ సందేహాలు): అవుట్‌సోర్స్ సెంటర్ వాట్సాప్ నెం.+965-65506360
- గృహ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు (వీసా 20): అవుట్‌సోర్స్ ఏజెన్సీ వాట్సాప్ నెం.+965-51759394
- గృహ కార్మికుల సమస్యలపై నేరుగా ఫోన్ చేసేందుకు, వాట్సాప్ సందేశాల కోసం: అవుట్‌సోర్స్ ఏజెన్సీ వాట్సాప్ నెం.+965-55157738
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







