‘బింబిసార’ ఫస్ట్ లుక్ విడుదల
- May 28, 2021
హైదరాబాద్: హీరోగా, నిర్మాతగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ప్రేక్షకులు హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. మరో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమయ్యారు. అందులో భాగంగా బింబిసార అనే సినిమాలో నటిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో కళ్యాణ్ రామ్ లుక్, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్తగా ఉన్నాయి...క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శత్రు సైనికులను చంపి వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉంది. తొలిసారిగా కళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్రలో నటిస్తుండటంతో పాటు, ఆ పాత్ర లుక్, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
గత ఏడాది షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా.. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. కొవిడ్ పరిస్థితులు కాస్త చక్కబడగానే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







