అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు
- May 28, 2021
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మరో నెల పాటు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకూ ఈ నిషేధం పొడిగించినట్టు డీజీసీఏ శుక్రవారంనాడు ప్రకటించింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కోవిడ్ కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉంది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా పలు దేశాలతో ఇండియా చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతోంది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో ఇండియా ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది.
— DGCA (@DGCAIndia) May 28, 2021
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







