DRDO కోవిడ్ మందు ధర ఖరారు..
- May 28, 2021
న్యూ ఢిల్లీ: కోవిడ్ బాధితుల చికిత్స కోసం భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. పొడి రూపంలో లభించే ఈ ఔషధం ఒక్కో సాకెట్ ధర రూ. 990 గా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రం ఫార్మా కంపెనీ డిస్కౌంట్ ధరకు అందించనున్నట్లు తెలిపింది. అయితే ఆ డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టత రాలేదు. 2-డీజీ మందును హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్’ (ఇన్‌మాస్) అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం ఎంతగానో పని చేస్తున్నట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో ఉండే ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (DGCI) ఇటీవల అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఈ నెల 17న మొదటి విడత కింద 10వేల సాచెట్లను, మే 27న రెండో విడత కింద మరో 10వేల సాచెట్లను రెడ్డీస్ ల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఔషధాన్ని జూన్ మధ్యలో వాణిజ్యపరంగా ప్రారంభించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







