సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే: అచ్చెన్నాయుడు
- May 28, 2021
విశాఖపట్నం: సీని రంగంలో తెలుగు జాతికి ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ 98 వ జయంతి సందర్భంగా బీచ్‌రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యే వెలగపూడి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, నగర టీడీపీ నేతలు నివాళర్పించారు. అనంతరం అచ్చెన్నా మాట్లాడుతూ తెలుగు జాతికి సేవ చేయాలని సినీ రంగాన్ని విడిచి పెట్టి రాజకీయంలోకి వచ్చారన్నారు. రాజకీయలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం తెచ్చారని తెలిపారు. నేడు పిల్లకాకి సంక్షేమం కోసం మాట్లాడుతున్నారని.. సంక్షేమం అంటే ఆనాడు ఎన్టీఆర్ పెట్టినవే అని స్పష్టం చేశారు. ఆనాడు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసి పోరాటం చేసిన ఘనత ఎన్టీఆర్దని గుర్తుచేశారు. రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రతి పక్ష పార్టీలపై దాడులు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ అనేది పోరాటం పార్టీ అని ..మళ్లీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ







