నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- August 29, 2026
జెడ్డా: నేపాల్‌లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌కు వారు వేర్వేరుగా సంతాప సందేశాలు పంపారు.
ఈ విపత్తులో మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు నేపాల్ ప్రజలకు రాజు సల్మాన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన వారు క్షేమంగా తమ కుటుంబాల వద్దకు తిరిగి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేపాల్‌పై మరింత విపత్తు ప్రభావం పడకుండా ఉండాలని ప్రార్థించారు. క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ కూడా అధ్యక్షుడు పౌడెల్, మృతుల కుటుంబాలు, నేపాల్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గల్లంతైన వారంతా సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.
భారీగా పెరుగుతున్న మృతుల సంఖ్య
నేపాల్‌తో పాటు పొరుగున ఉన్న చైనాలోనూ వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మీడియా కథనాలు, స్థానిక అధికారుల సమాచారం ప్రకారం రెండు దేశాల్లో కలిపి 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 3,000 మంది వరకు ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం.
భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతులు, గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







