డైరెక్ట్ క్లాసులా, రిమోట్ క్లాసులా..ప్రైవేట్ స్కూళ్లదే నిర్ణయం

- May 29, 2021 , by Maagulf
డైరెక్ట్ క్లాసులా, రిమోట్ క్లాసులా..ప్రైవేట్ స్కూళ్లదే నిర్ణయం

దోహా: కోవిడ్ మహమ్మారి సవాళ్ల తర్వాత తిరిగి సాధారణ పరిస్థితుల వైపు అడుగులు వేస్తున్న ఖతార్ ప్రభుత్వం..స్కూళ్ల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు చేసింది. మే 30(ఆదివారం) నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించటంతో క్లాసుల నిర్వహణ తీరుపై తల్లిదండ్రుల్లో ఆయోమయం నెలకొంది. అయితే...గందరగోళానికి తెరదించుతూ ఖతార్ విద్యాశాఖ ప్రైవేట్ స్కూళ్లలో క్లాసుల నిర్వహణ నిర్ణయం స్కూల్ నిర్వాహకులకే అప్పగించింది. డైరెక్ట్ గా క్లాసులు నిర్వహించాలా, రిమోట్ క్లాసులనే కొనసాగించాలా అనే నిర్ణయాన్ని ప్రైవేట్ స్కూళ్లకే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అభీష్టం మేరకు ఆయా స్కూళ్లు క్లాసుల నిర్ణయం మేరకు ఓ అభిప్రాయానికి రావాలని సూచించింది. అయితే..డైరెక్ట్ క్లాసులు నిర్వహించాలనుకుంటే మాత్రం పూర్తిస్థాయి విద్యార్ధుల సంఖ్యలో 30
శాతం విద్యార్ధుల హజరు ఉండాలని స్పష్టం చేసింది. అలాగే నాలుగు పిరియడ్లకు తగ్గకుండా క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. అదే కేజీ స్థాయి విద్యార్ధులకు రెండు పిరియడ్లకు తగ్గకుండా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com