సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ విజిటింగ్ సమయాల్లో మార్పులు

- May 29, 2021 , by Maagulf
సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ విజిటింగ్ సమయాల్లో మార్పులు

బహ్రెయిన్: సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ లో విజిటింగ్ సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. శని, మంగళవారాల్లో కేవలం గంట మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు విజిటింగ్ సమయంగా ప్రకటించింది. అయితే..వ్యాక్సిన్ తీసుకున్నవారు, కోవిడ్ బారిన పడి కోలుకున్నవారు, 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే కాంప్లెక్స్ లోకి అనుమతి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు బీఅవేర్ బహ్రెయిన్ యాప్ ద్వారాగానీ, డాక్యుమంట్ల రూపంలోగానీ వ్యాక్సినేషన్ ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com