భార‌త్‌కు మా మ‌ద్ద‌తు కొన‌సాగుతుంది: కువైట్ విదేశాంగ మంత్రి

- May 29, 2021 , by Maagulf
భార‌త్‌కు మా మ‌ద్ద‌తు కొన‌సాగుతుంది: కువైట్ విదేశాంగ మంత్రి

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు త‌మ మ‌ద్ద‌తు కొన‌సాగుతుంద‌ని మ‌రోసారి కువైట్ స్ప‌ష్టం చేసింది.ఈ మేర‌కు ఆ దేశ విదేశాంగ మంత్రి డా.షేక్‌ అహ్మద్ నాజర్ అల్ మహ్మద్ అల్ సబా శుక్రవారం ప్ర‌క‌టించారు.భార‌త విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంక‌ర్‌తో ఫోన్ కాల్‌లో మాట్లాడిన మ‌హ్మ‌ద్ అల్ స‌బా..ప్ర‌స్తుతం భార‌త్‌కు కువైట్ అందిస్తున్న స‌హాయ స‌హ‌కారాల‌పై చ‌ర్చించారు.ఇప్ప‌టికే భారత్ కు భారీ మొత్తంలో అత్య‌వ‌స‌ర వైద్య సామాగ్రిని అందించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా సంక్షోభ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న భార‌త్‌కు మున్ముందు కూడా త‌మ పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని కువైట్ విదేశాంగ మంత్రి హామీ ఇచ్చారు. విప‌త్క‌ర స‌మ‌యంలో చేదోడుగా నిలిచిన కువైట్‌కు మంత్రి జైశంక‌ర్ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.ఈ సంద‌ర్భంగా ఇరువురు మంత్రులు రెండు దేశాల మ‌ధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మ‌రింత బ‌ల‌ప‌రిచే విష‌య‌మై చ‌ర్చించారు.  ​

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com