100 కేంద్రాల్లో అపాయింట్మెంట్ లేకుండానే ఫైజర్ వ్యాక్సిన్

- May 29, 2021 , by Maagulf
100 కేంద్రాల్లో  అపాయింట్మెంట్ లేకుండానే ఫైజర్ వ్యాక్సిన్

అబుధాబి: ఎమిరేట్స్ పరిధిలోని 100 వైద్య కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు అబుధాబి ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు ఇక నుంచి అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది. 12 ఏళ్లు అంతకుమించిన వయస్సున్న పౌరులు, ప్రవాసీయులు అందరికీ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోని వాళ్లంతా వెంటనే టీకాలు తీసుకోవాలని అబుధాబి ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది. పన్నెండేళ్లకు పైబడిన పిలల్లకు వ్యాక్సిన్ ఇప్పించటం ద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ పిల్లలు మళ్లీ స్కూల్స్ కు వెళ్లేలా తల్లిదండ్రులు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఫైజర్ బయోన్టెక్ తో పాటు సినోఫార్మ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందని, లబ్ధిదారులు తమకు కావాల్సిన వ్యాక్సిన్ను ఎంపిక చేసుకోవచ్చని సూచించింది. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com