'ICBF' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- May 29, 2021
దోహా: దోహాలో ICBF(ఇండియన్ కమ్యూనిటీ బెనివోలెన్ట్ ఫోరమ్) సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో TGS సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.శుక్రవారం ఉదయం 8 గంటలకు హమ్మద్ బ్లడ్ డోనేషన్ సెంటర్ లో శిబిరాన్ని భారత రాయబారి దీపక్ మిట్టల్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం రెండవ ప్రధాన కార్యదర్శి ఫేహిం,జాయిద్ హుస్మాన్(ఐసీబీఫ్ అధ్యక్షుడు), బాబురాజన్(ఐసీసీ అధ్యక్షులు), అజిమ్ అబ్బాస్(ఐబీపీసీ అధ్యక్షుడు) మరియు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యలు శంకర్ గౌడ్, ప్రేమకుమార్ బొడ్డు, మహేందర్ చింత కుంట,ఎల్లయ్య తల్లాపెళ్లి, కింగ్ రాజు ,శ్రీధర్ అబ్బాగౌని,గడ్డి రాజు,రాజేష్ ,శోభన్ బంధారపు,వెంకట్ గౌడ్,రాజేశ్వర్ గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు.తెలంగాణ గల్ఫ్ సమితి పిలుపు మేరకు అధిక సంఖ్యలో వచ్చి రక్తదానం చేసిన సభ్యలందరికి ధన్యవాదాలు తెలిపారు.


--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







