యూఏఈలో ఐపీఎల్ సెకండాఫ్: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
- May 29, 2021
న్యూ ఢిల్లీ: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్‌ను పున: ప్రారంభించేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.ఇవాళ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం వాయిదా పడిన ఐపీఎల్ 2021ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది.సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది నిర్వహించిన వేదికల్లోనే మిగిలిన 31 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. దుబాయ్, అబుధాబి, షార్జా స్టేడియంలలో బయోబబుల్ వాతావరణంలో లీగ్‌ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. మరికొద్ది రోజుల్లో లీగ్, ప్లేఆఫ్ మ్యాచ్‌లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. కాగా, ఐపీఎల్ సెకండాఫ్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్
- ఖతార్‌లో కొత్త ప్రాంతీయ రక్షణ భాగస్వామ్యం.. త్వరలో కీలక ప్రకటన..!
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!







