కరోనా పేషెంట్స్ అటెండర్లకు ఉచితంగా భోజనం..
- May 29, 2021
హైదరాబాద్: కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే..వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక..వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి..కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా..వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్..ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి..కరోనా రోగుల అటెండర్లకు కూడా ఉచితంగా భోజనం అందింస్తోంది.ప్రస్తుతం గాంధీ, నిమ్స్, టిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రులు దగ్గర కోవిడ్ రోగుల అటెండర్లకు మా సేవలను విస్తరిస్తున్నామని..ఈ ఆస్పత్రుల వెలుపల వందలాది మంది అటెండర్లు ఉన్నారు, వారు వివిధ గ్రామాల నుండి వచ్చినవారు..వారు రోజూ పూర్తిస్థాయిలో భోజనం తినలేని పరిస్థితి..ఇది గమనించి…మేం వేదం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం ప్యాకెట్లను అందిస్తామని తెలిపారు అలిశెట్టి అరవింద్.అవసరం ఉన్నవాళ్లు +91 9985588821, +91 9985588831, +91 9985588841 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







