ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు

- May 29, 2021 , by Maagulf
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు

ప్ర‌ముఖ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (LIC) ప‌లు ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్ విభాగంలో ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 6 ఖాళీల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్య‌ర్థులు ఢిల్లీ, కోల్‌క‌తా, బెంగళూరు, భోపాల్‌, ముంబ‌యి బ్రాంచ్‌ల‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది.

అర్హ‌త‌లు..

  • అభ్య‌ర్థులు సోష‌ల్ వ‌ర్క్‌/రూర‌ల్ మేనెజ్‌మెంట్ విభాగంలో క‌నీసం 55 శాతం మార్కుల‌తో డిగ్రీలో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. డిస్టెన్స్ లెర్నింగ్‌, పార్ట్‌టైమ్‌, క‌ర‌స్పాండెంట్ కోర్సులు చేసిన వారి ఈ పోస్టుల‌కు అన‌ర్హులు.
  • ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు జ‌న‌వ‌రి 1, 2021 నాటికి 23 నుంచి 30 ఏళ్ల మ‌ధ్య‌లో ఉండాలి.
  • సంబంధిత విభాగంలో ఏడాది అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి.

వివరాలు..

  • ఆన్‌లైన్ అప్లికేష‌న్ల ప్ర‌క్రియ మే 24న ప్రారంభ‌మ‌వుతుండ‌గా.. జూన్ 7న ముగియ‌నుంది.
  • ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఆనలైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాదికి రూ. 6 నుంచి రూ. 9 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతంగా అందిస్తారు.
  • పూర్తి వివ‌రాల‌కు http://www.lichousing.com వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com