కరోనా థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం రేడీ..
- May 29, 2021
అమరావతి: ఓవైపు కరోనా సెకండ్ వేవ్‌లో ఇంకా భారీగా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై హెచ్చరికల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్రమత్తం అవుతోంది..మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాతో అలర్ట్ అయిన ప్రభుత్వం.. పిడీయాట్రిక్ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసింది.. APMSIDC చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలో 8 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది.మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్ ప్రొటోకాల్స్ ఏ విధంగా ఉండాలనే అంశాలపై అధ్యయనం చేయనుంది టాస్క్‌ఫోర్స్.చిన్న పిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణపై నివేదిక కూడా ఇవ్వనుంది..వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కమిటీని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







