ప్రవాసీయుల స్థానంలో స్థానికులకు ఉద్యోగాలపై కార్మిక శాఖ సమావేశం

- May 30, 2021 , by Maagulf
ప్రవాసీయుల స్థానంలో స్థానికులకు ఉద్యోగాలపై కార్మిక శాఖ సమావేశం

ఒమన్: ఒమనైజేషన్ లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్న ఒమన్...వలస కార్మీకుల స్థానంలో స్థానికులను భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం కార్మిక శాఖ, మానవ వనరుల శాఖ డైరెక్టర్లు సంయుక్త సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంస్థల్లో వీలైనంత మేరకు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై చర్చించారు. నిర్ణీత కాలంలో వలస కార్మీకుల స్థానంలో స్థానికులను భర్తీ చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకొని..డెడ్ లైన్ లోగా ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన ప్రణాళికపై సమీక్షించారు. అలాగే డెడ్ లైన్ లోగా ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా టెంపరరీ కాంట్రాక్ట్ వర్కర్ల నియామకాలను చేపట్టాలని ఈ సమావేశం నిర్ణయించింది. సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ రాజ ఉత్తర్వ్యులకు అనుగుణంగా గవర్నమెంట్ యూనిట్స్ లో నిర్దేశించుకున్న కాలవ్యవధిలోగా ఒమనీలను భర్తీ చేసుకోవాల్సిన ఆవశ్యతపై కార్మిక శాఖ, మానవ వనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో ప్రస్తావించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com