భారత్ మినహా 11 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత

- May 30, 2021 , by Maagulf
భారత్ మినహా 11 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత

సౌదీ: కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 11 దేశాలపై నిషేధాన్ని తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ, యునైటెడ్ స్టేట్స్, ఐర్లాండ్, ఇటలీ, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జపాన్ దేశాల ప్రయాణికులకు ఆదివారం(మే 30) నుంచి ప్రవేశం కల్పించనున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి విశ్వనీయ సమాచారం. అయితే...ట్రావెల్ బ్యాన్ ఎత్తివేసినా ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్ ప్రొసిజర్ పాటించాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న భారత్ పై మాత్రం ట్రావెల్ బ్యాన్ యథావిధిగా కొనసాగనుంది. భారత్ తో పాటు ఈజిప్ట్, టర్కీ, లెబనాన్, అర్జెంటీనా, పాకిస్తాన్, ఇండోనేషియా, సౌతాఫ్రికాలపై ట్రావెల్ బ్యాన్ కంటిన్యూ కానుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com