ఒమన్: వలసదారులకు వర్క్ వీసా నిబంధనల మార్పు
- May 31, 2021ఒమన్: విజిట్ వీసాపై ఒమన్ వచ్చే వలసదారులు, విజిటర్స్, తమ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ల కింద మార్చుకోవచ్చని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఫ్యామిలీ జాయినింగ్ వీసాలు, స్టూడెంట్ వీసాలు ఇతర వీసాలకు సంబంధిత నిబంధనలకు లోబడి వుంటే, వాటికీ ఈ వెసులుబాటు వర్తిస్తుంది.వర్క్ వీసా లేదా టెంపరరీ వర్క్ వీసా కిందకి ఫారినర్స్ రెసిడెన్స్ చట్టానికి అనుగుణంగా ఆయా వీసాలను అథారిటీస్ మార్పు చేస్తాయి. జిసిసి దేశాలకు చెందిన నివాసితులకు జారీ చేయబడిన విజిట్ వీసా, సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసాలు, సింగిల్ మరియు మల్టిపుల్ ఎంట్రీ బిజినెస్ వీసాలు, ఎక్స్‌ప్రెస్ వీసాలు, తక్షణ వీసాలు, స్టూడెంట్ వీసాలు, ఆన్ బోర్డు సెయిలర్లకు ఇచ్చే వీసాలు, క్రూయిజ్ షిప్పుల ద్వారా వచ్చే ప్రయాణీకులు, రెసిడెన్షియల్ యూనిట్స్ కలిగిన వారికి ఇచ్చే వీసాలు, వారి కుటుంబ సభ్యులకు లభించే వీసాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. ఆయా వీసాల మార్పుకు సంబంధించి అవసరమైన ఫీజుల్ని చెల్లించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?