చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వున్నవారికి వ్యాక్సినేషన్ అందుబాటులో
- May 31, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కోవిడ్ 19 వ్యాక్సిన్ విషయమై స్పష్టతనిచ్చింది. పౌరులు అలాగే నివాసితులు ఎవరికైతే రెసిడెన్సీ వుంటుందో వారందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులో వుందని పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిథి డాక్టర్ ముహమ్మద్ అల్ అబ్దులాలీ ఈ విషయాన్ని వెల్లడించారు. వైరస్ ప్రమాదకరమైనదనే విషయాన్ని మరోమారు స్పష్టం చేశారాయన. ఎవరూ దీన్ని తేలిగ్గా తీసుకోకూడదని తేల్చి చెప్పారు అబ్దులాలీ. 100 మందికి కరోనా సోకితే, 10 మంది ఇంటెన్సివ్ కేర్ చికిత్స పొందాల్సి వస్తోంది. వారిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారని వివరించారు. వ్యాక్సిన్ పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే, 100 మందికి కరోనా సోకితే.. అందులో ఒక్కరు కూడా ఆసుపత్రిలో చేరే అవసరం రావడంలేదు గనుకనే, వ్యాక్సిన్ తప్పనిసరి అని చెప్పారు. కుటుంబ పరమైన వేడుకల వల్ల 75 శాతం వరకు కేసులు నమోదవుతున్నట్లు అబ్దులాలి చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







