సనద్ పేరుతో వాట్సాప్ ఆటో ఆన్సరింగ్ సర్వీస్

- June 01, 2021 , by Maagulf
సనద్ పేరుతో వాట్సాప్ ఆటో ఆన్సరింగ్ సర్వీస్

కువైట్: నాణ్యమైన, వేగవంతమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ సనద్ పేరుతో వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 24349191 నెంబర్ ద్వారా పలు ప్రభుత్వ సేవలను పొందవచ్చని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర సంబంధాలు& సెక్యూరిటీ మీడియా విభాగం అధికారులు వివరించారు. ఒక్కో సేవకు సంబంధించి నిర్ధిష్టమైన కోడ్ మెను ఉంటుంది. మెనులోని కోడ్ ను టైప్ చేసి మెసేజ్ చేయగానే ఆటో ఆన్సరింగ్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు అవసరమైన వివరాలు, సేవలు పొందవచ్చు. ఎలక్ట్రానిక్ సర్వీసులకు-S, అంతర్గత మంత్రిత్వ శాఖ సేవలకు-T, జనరల్ ఎంక్వైరీస్-I కోడ్ ద్వారా సర్వీస్ పొందవచ్చు. అలాగే 1- ఉల్లంఘనలకు సంబంధించి ఫైన్ చెల్లింపులు, 2- రెసిడెన్సీ అఫైర్స్ సర్వీస్, 3- డ్రైవింగ్ లైసెన్స్ సర్వీస్, 4- పీపీటీ ప్లాట్ ఫాం, 5- డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్మెంట్స్, 6- పర్సనల్ ఎంక్వైరీస్, 7- రీమైండ్ మీ సర్వీస్ లను పొందవచ్చు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com