ఆన్ లైన్, సోషల్ మీడియా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ లపై హెచ్చరిక
- June 01, 2021
బహ్రెయిన్: సోషల్ మీడియా, ఆన్ లైన్లో కనిపించే ఇన్వెస్ట్మెంట్ లింక్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ హెచ్చరించింది. అనధికారిక వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో లింక్ లను పంపుతూ కొందరు మోసగాళ్లు వినియోగదారుల సమాచారం సేకరించి చీటింగ్ చేసే ప్రమాదం ఉందని ఆర్ధిక భద్రత, అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు. పెట్టుబడుల పేరుతో ఆన్ లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేలా హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు, ట్రేడింగ్ కు సంబంధించి ఆన్ లైన్ లో ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వివరాలను వెల్లడించకూడదని స్పష్టం చేశారు. పౌరులు, ప్రవాసీయులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వెబ్ సైట్ గానీ, అధికారిక ఆమోదం పొందిన ఫైనాన్సియల్ సంస్థల ద్వారా మాత్రమే పెట్టుబడులు పెట్టాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







