ఆక్సీజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్న ఎన్టీఆర్ ట్రస్ట్
- June 01, 2021
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణలో రెండు ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.ఈ విషయాన్ని ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు.ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణలో కూడా రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నారా భువనేశ్వరీ తెలియజేశారు.అనాథ శవాలకు అంతిమ సంస్కారం ఏర్పాటుకు సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.టెలి మెడిసిన్, మందుల పంపిణీ, కరోనా రోగులకు నిరంతర సేవలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ తెలియజేసింది.కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన సమయంలో ఆసుపత్రుల్లో చేరిన వ్యక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







