శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

- June 01, 2021 , by Maagulf
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీ స్థాయిలో బంగారం పట్టుబడింది.కువైట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 700 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు.ఓ కేటుగాడు 34 లక్షల విలువ చేసే 24 క్యార‌ట్‌ల బంగారాన్ని గొలుసుల రూపంలో తీసుకువచ్చాడు. గొలుసుల రూపంలో వున్న బంగారాన్ని తను వేసుకున్న ప్యాంట్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న జేబులో దాచి తరలించే యత్నం చేశాడు.విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల‌ తనిఖీలలో ఈ విషయం బయట పడింది. ఇదంతా విదేశీ బంగారం కావడంతో వారు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.బంగారం సీజ్ చేసి ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.ఈ మేరకు ఆ వ్యక్తి మీద కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com