భారతీయ పాస్‌పోర్ట్ ఏజెన్సీ బిఎల్‌ఎస్ కొత్త బ్రాంచి వివరాలు

- June 01, 2021 , by Maagulf
భారతీయ పాస్‌పోర్ట్ ఏజెన్సీ బిఎల్‌ఎస్ కొత్త బ్రాంచి వివరాలు

అబుధాబి: భారతీయ పాస్‌పోర్ట్‌లు మరియు వీసాలను ప్రాసెస్ చేసే అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ అయిన బిఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ అబుధాబి లో కొత్త అడ్రస్ కు మార్చబడింది అని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

అది, అల్ రీమ్ ఐలాండ్ లోని షామ్స్ బొటిక్ మాల్‌కు మార్చబడింది. ఈ కేంద్రం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. చివరి టోకెన్ సాయంత్రం 4.30 గంటలకు అందించబడుతుంది. క్రొత్త బ్రాంచీ చిరునామా: షామ్స్ బొటిక్ మాల్, లెవెల్ 1, షాప్ నంబర్ 32, అల్ రేఫా స్ట్రీట్, అల్ రీమ్ ఐలాండ్.

అయితే, అల్ ముహైరి భవనంలో ఉన్న ఆఫీసులో ప్రీమియం లాంజ్ సేవలను అందిస్తుంది. 

అలాగే, ముసాఫాలో డాన్యూబ్ హోమ్స్ మరియు అబుధాబి లేబర్ కోర్ట్ వెనుక ఉన్న  ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఏడాది ప్రారంభంలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com