చైనాలో అలెర్ట్: మనిషికి సోకిన బర్డ్‌ఫ్లూ...
- June 01, 2021
బీజింగ్: చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా డ్రాగన్ కంట్రీలో బర్డ్ ఫ్లూ మనిషికి సోకింది. ప్రపంచంలోనే ఈ కేసు తొలికేసుగా ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం తెలిపింది.
హెచ్10ఎన్3 స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. ఈ కేసు నమోదు కాగానే వైద్య. ఆరోగ్యశాఖాధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల పురుషుడికి బర్డ్ ఫ్లూ సోకిందని జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది.ప్రపంచంలోనే తొలిసారిగా బర్డ్ ఫ్లూ కేసు తమ దేశంలోనే మానవుడికి సోకిందని కమిషన్ తన వెబ్సైట్లో పేర్కొంది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) వారం కింద రక్త పరీక్షలు చేయగా అతడికి బర్డ్ ఫ్లూ సోకిందని ఫలితాల్లో నిర్ధారైనట్టుగా తెలిపింది.
అతడికి బర్డ్ ఫ్లూ సోకడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు అతడికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అతడి ఎవరెవరిని కలిశారో వారిని గుర్తించి వారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని జాతీయ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







