యూఏఈలో 81% మందికి కోవిడ్ వ్యాక్సిన్ పూర్తి
- June 02, 2021
యూఏఈ: యూఏఈలో అర్హులైన ప్రజల్లో (16 ఏళ్లు అంతకుపైబడిన వయసువారు) 81% మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసింది యూఏఈ. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంపై వీక్లీ రీవ్యూ నిర్వహించిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. 60 ఏళ్ల వయసుకు మించిన వారిలో 92.35% మందికి వ్యాక్సిన్ అందినట్లు వివరించారు. రానున్నరోజుల్లో వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేస్తామన్నారు. 12-15 మధ్య వయస్కులకు వ్యాక్సిన్ అందించేందుకు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలాఉంటే..కోవిడ్ ట్రీట్మెంట్లో భాగంగా సోట్రోవిమాబ్-విఐఆర్ ఔషధానికి అత్యవసర ఆమోదం తెలిపిన యూఏఈ..కోవిడ్ చికిత్సలో సోట్రోవిమాట్ ప్రభావంతంగా పని చేస్తోందన్నారు. సోట్రోవిమాట్ తో కోవిడ్ పేషెంట్లు త్వరతగతిన కోలుకోవటంతో పాటు మరణాల రేటును 85% వరకు తగ్గిందని అధికారులు తెలిపారు. అయితే..సోట్రోవిమాట్ డ్రగ్ కేవలం కోవిడ్ చికిత్స కోసమేగానీ, వ్యాక్సిన్ కు ప్రత్యామ్నాయం కాదని వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







