ఈ నెలాఖరు నాటికి ఎయిర్ పోర్టు ఓపెన్ అయ్యే అవకాశాలు
- June 02, 2021
కువైట్: ఓవైపు వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను ముమ్మరం చేస్తూనే మరోవైపు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ నెలాఖరు నాటికి ప్రయాణికుల కోసం ఎయిర్ పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. అయితే..కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణికులను అనుమతించేలా ప్రోటోకాల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కువైట్ ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్ డోసులను తీసుకున్నవారికి ఎలాంటి అవాంతరాలు లేకుండా దేశంలోకి అనుమతించే అవకాశాలు ఉన్నాయి. కువైట్ చేరుకునే విదేశీ ప్రయాణికులు విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్నా..అది కువైట్ ప్రభుత్వం ఆమోదించిన లిస్టులో లేకపోతే వారికి అనుమతి ఉండదు. అయితే..కువైట్ బయల్దేరే ముందే ప్రభుత్వం ఆమోదించిన వ్యాక్సిన్లలో కనీసం ఒక్క డోసు తీసుకున్నా ఎంట్రీకి ఛాన్స్ ఉంటుంది. ఇదిలాఉంటే విద్యాసంస్థల పున:ప్రారంభం దిశగా కూడా కువైట్ యోచిస్తోంది. సెప్టెంబరులో నర్సరీలను ప్రారంభించొచ్చని అంచనాలు ఉన్నాయి. అలాగే దేశంలోని వ్యాక్సినేషన్ రేటును బట్టి స్కూల్స్ ఓపెనింగ్ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. దేశంలో 60% వరకు వ్యాక్సినేషన్ పూర్తి అయితే స్కూళ్లను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని...లేదంటే విడతల వారీగా క్లాసులను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







