కువైట్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
- June 02, 2021
కువైట్ సిటీ: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కువైట్ లోని తెలంగాణ జాగృతి కువైట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

తెలంగాణ జాగృతి కువైట్ ప్రెసిడెంట్ వినయ ముత్యాల ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న కరోనా పరిస్థితిలో చాల మందికి రక్త దానం ఎంతో అవసరమని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే ఒక పండగ అని అందుకే ఈ సందర్భంగా రక్త దానం చేయడం జరిగింది అని అన్నారు.
ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఇవాల్టి రాష్ట్ర అవతరణ దినోత్సవం వారి ఆత్మ గౌరవ నినాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు వసంతాలు పూర్తయింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ కెసిఆర్ అభివృద్ధిని పాలన కొనియాడారు.. ఒకప్పటి ఆందోళన గ్రామాలు నేడు అభివృద్ధి పల్లెలు.. గడప చెంతకు ప్రభుత్వ పాలన సంక్షేమ పథకాలు ఇది 7 ఏళ్ల తెలంగాణ సాధించిన ఘన విజయం..భారత దేశంలో తొలిసారిగా రైతులకు రైతుబంధు, వృద్ధులకు ఆసరా, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చారిత్రాత్మక పధకాలు తెచ్చిన ఘనత ఒక్క కెసిఆర్ కి సాధ్యమైందని అన్నారు.

తెలంగాణ జాగృతి కువైట్ కోర్ కమిటీ సభ్యులు జనరల్ జనరల్ సెక్రెటరీ ప్రమోద్ కుమార్ మార్క, జాయింట్ సెక్రెటరీ మొహమ్మద్ సైఫుద్దీన్, ట్రెజరర్ మామిడిపల్లి రాజన్న, మరియు సెక్రెటరీ వారం రాజశేఖర్ జాగృతి కువైట్ ప్రెసిడెంట్ వినయ్ ముత్యాల ధన్యవాదాలు తెలిపారు. కువైట్ లో ఉన్న తెలంగాణ గల్ఫ్ కార్మికులకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా తెలంగాణ జాగృతి కువైట్ అండగా ఉంటుందని తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







