ప్రవాసంద్రులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన Dr.రవి కుమార్ వేమూరు

- March 06, 2016 , by Maagulf

ఆంధ్ర ప్రదేశ్ అడ్వైసర్ మరియు APNRT అధ్యక్షులు శ్రీ . రవి కుమార్ వేమూరు గారు , యూరప్ మరియు అమెరికా ప్రవాసంద్రులతో , టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు . Dr రవి కుమార్ గారు , APNRT ద్వార అందిస్తున్న సేవలు ,పెట్టుబడులకు అందిస్తున్న సహకారం మరియు ఆకర్షణీయ గ్రామాలూ అభివ్రుది కి APNRT చేస్తున్న సేవలను గురుంచి వివరించారు . ప్రవాసాంధ్రులు అందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని , ఆదర్శాగ్రామాల అభివ్రుద్హిలో పాలు పంచుకోవాలి అని పిలుపునిచ్చారు .

ఈ సందర్భంగా పలువురు NRI లు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వనరులు మరియు విధివిధానాలను ఎంతో ఆసక్తి గా అడిగి తెలుసుకున్నారు. NRI లు అడిగిన అన్ని ప్రశ్నలకి రవి కుమార్ గారు సవివరమైన సమాధానాలను ఇచ్చారు . ఈ కార్యక్రమము ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నాము అని ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేసారు . ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి , ఈ కార్యక్రమంలో పాల్గోన్న రవి కుమార్ గారికి ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలియజేసారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com