కోవాక్స్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కు 40 మిలియన్ డాలర్ల సాయం

- June 03, 2021 , by Maagulf
కోవాక్స్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ కు 40 మిలియన్ డాలర్ల సాయం

కువైట్: కోవిడ్ వైరస్ నిర్మూలన కోసం అంతర్జాతీయ సమాజం చేస్తున్న కృషిలో తాము భాగస్వామ్యం అవుతున్నట్లు కువైట్ ప్రకటించింది. పేద దేశాల ప్రజలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ చేరేలా ఐక్యరాజ్య సమితి చేపట్టిన కోవాక్స్ ప్రొగ్రాంకు తాము కూడా మద్దతుగా నిలబడతామని వెల్లడించింది. ఇందుకోసం కోవాక్స్ ప్రొగ్రాంకు 40 మిలియన్ డాలర్ల విరాళంగా ప్రకటించింది కువైట్. పేద దేశాల ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం ద్వారా వైరస్ బారి నుంచి ప్రపంచానికి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com