అన్ని చెల్లింపుల తర్వాతే ఫైనల్ ఎగ్జిట్ వీసాల జారీ

- June 03, 2021 , by Maagulf
అన్ని చెల్లింపుల తర్వాతే ఫైనల్ ఎగ్జిట్ వీసాల జారీ

సౌదీ అరేబియా: అన్ని బిల్లులు చెల్లించిన తర్వాతే ప్రవాసీయులకు ఫైనల్ ఎగ్జిట్ వీసా జారీ చేయనున్నట్లు పాస్ పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ప్రకటించింది. ఫోన్ బిల్లులతో సహా అన్ని బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.ఫైనల్ ఎగ్జిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే నాటికి దరఖాస్తుదారిడి పేరు మీద ఎలాంటి వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదు.మొత్తం బకాయిలు అన్ని చెల్లించి, తమ పేరు మీదున్న వాహనాల రిజిస్ట్రేషన్లు బదలాయించిన తర్వాతే వీసా జారీ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. ఫైనల్ ఎగ్జిట్ వీసా జారీ నుంచి 60 రోజుల పాటు గడువు ఉంటుందని,ఆ నిర్ణీత గడువులోగా దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com