కోవిడ్ నిబంధనలు పాటించని 390 మందిపై చర్యలు
- June 03, 2021
దోహా: కోవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని ఖతార్ అధికారులు మరోసారి హెచ్చరించారు.కోవిడ్ నిబంధనలు పాటించకపోవటం అంటే చట్టవిరుద్ధ చర్యలకు పల్పడుతున్నట్లేనని స్పష్టం చేసింది. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన వారిపై ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసిన ఖతార్ అధికారులు...తాజాగా మరో 390 మందిపై చర్యలు తీసుకుంది. ఇందులో 355 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని వెల్లడించారు. వాహనంలో పరిమితికి మించి ప్రయాణించినందుకు మరో 14 మంది కేసు నమోదు చేశారు. కోవిడ్ రూల్స్ ప్రకారం ఒక వాహనంలో డ్రైవర్ తో సహా నలుగురు మాత్రమే ప్రయాణించాలి. కుటుంబసభ్యులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. అలాగే క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేసిన ఓ వ్యక్తితో పాటు ఎతెరాజ్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోని ఇద్దరు వ్యక్తులపై నమోదు చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటించని వాళ్లందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







