హీరో నితిన్ తో వక్కంతం వంశీ..
- June 03, 2021
హైదరాబాద్: వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ .. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ అంధాధూన్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు నితిన్. రైటర్ గా ఫుల్ సక్సెస్ అయి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీకి నితిన్ కి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా ఆగస్టు నెలలో గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం. ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సన్నివేశాలతో పాటు వోల్టేజ్ యాక్షన్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి. ఇక నితిన్ ఇప్పటికే కృష్ణ చైతన్య దర్శకత్వం లో పవర్ పేట అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







