ఏపీలో కరోనా కేసుల వివరాలు

- June 03, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 11,421 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,25,682 కు చేరింది. ఇందులో 15,75,557 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,38,912 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 81 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,213 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 16,223 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 86,223 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com