కోవిడ్ సెఫ్టీ రూల్స్ బ్రేక్..10,745 మందికి ఫైన్
- June 04, 2021
దుబాయ్: కోవిడ్ సేఫ్టీ రూల్స్ ను ఉల్లంఘించిన 10,745 మందికి జరిమానా విధించినట్లు దుబాయ్ పోలీసులు వెల్లడించారు. గత ఆరు నెలల కాలంలో బుర్జ్ దుబాయ్ ప్రాంతంలో ఈ ఉల్లంఘనలు జరిగినట్లు తెలిపారు. గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మే మధ్య కాలంలో పబ్లిక్, ప్రైవేట్ ట్రాన్స్ పోర్టేషన్ లో మాస్కులు ధరించనివారికి, భౌతిక దూరం పాటించని వారికి జరిమానాలు విధించినట్లు పోలీసులు వివరించారు. కోవిడ్ సెఫ్టీ రూల్స్ అమలు విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నామని బుర్ దుబాయ్ పోలీస్ బ్రిగేడియర్ చెప్పారు. మొత్తం 96,885 వాహనాలు, 24,900 మందిని మానిటర్ చేశామన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా తొలిగిపోలేదనే విషయాన్ని దుబాయ్ ప్రజలు గుర్తుంచుకోవాలని, ప్రస్తుతం వైరస్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో కొన్ని నిబంధనలు సడలించినా, వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతాల్లో పలు వెసులుబాట్లు కల్పించినా కోవిడ్ సెఫ్టీ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆంక్షలు సడలించినా ఫేస్ మాస్క్, భౌతిక దూరం విషయంలో ఎలాంటి సడలింపులు లేవన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కోవిడ్ సెఫ్టీ రూల్స్ అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వ శాఖల్లోని పలు బృందాలు నిరంతరం నిఘా కొనసాగిస్తాయన్నారు. ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 901 (దుబాయ్ పోలీస్) లేదా 600545555 (దుబాయ్ ఎకానమీ)కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. ఇదిలాఉంటే బుధవారం కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 48 మందికి ఫైన్ విధించారు. ఇందులో ఎక్కువ మంది ఫేస్ మాస్క్ ధరించనివారు, భౌతిక దూరం పాటించనివారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!