వ్యాక్సిన్ తర్వాత అనెస్తేషియా తీసుకోవచ్చు...సౌదీ ఆరోగ్యశాఖ క్లారిటీ
- June 04, 2021
సౌదీ: కోవిడ్ వ్యాక్సిన్ కు జనరల్ అనెస్తేషియా తీసుకున్న ఎలాంటి నష్టం లేదని సౌదీ అరోగ్యశాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా అనెస్తేషియా తీసుకోవచ్చని వెల్లడించింది. ఓ వ్యక్తి లేవనేత్తిన సందేహానికి సమాధానం ఇస్తూ ఈ ప్రకటన విడుదల చేసింది ఆరోగ్య శాఖ. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మత్తు మందు ఇవ్వాలంటే 14 రోజుల గడువు అవసరం అని డాక్టర్లు చెబుతున్నారని, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ సదరు వ్యక్తి కోరారు. దీనిపై స్పందించిన సౌదీ ఆరోగ్య శాఖ వ్యాక్సిన్ తర్వాత అనెస్తేషియాతో ఎలాంటి నష్టం ఉండదని తెలిపింది. వ్యాక్సిన్ వైరస్ పై పొరాడేందుకేనని వివరించింది. ప్రజలు అధికారిక సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని, అనవసర ప్రచారాలను పరిగణలోకి తీసుకొని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..