జీతాల బదిలీ సర్టిఫికెట్ తో వర్క్ పర్మిట్ల లింక్ నిర్ణయం వాయిదా
- June 04, 2021
కువైట్ సిటీ: వర్క్ పర్మిట్లకు సంబంధించి యాజమాన్యాలు స్థానిక ఆర్ధిక సంస్థలకు జీతాల బదిలీ సర్టిఫికెట్ సమర్పించాలన్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ మేరకు మానవ వనరుల డైరెక్టరేట్ జనరల్ ఓ సర్క్యూలర్ జారీ చేశారు. కొత్తగా వర్క్ పర్మిట్లు ఇవ్వాలన్నా, రెన్యూవల్ చేయాలన్నా, బదిలీ చేయాలన్నా సిబ్బంది శాలరీ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లను దరఖాస్తుతో జత పర్చాలని గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే..జీతాల బదిలీ సర్టిఫికెట్ తో వర్క్ పర్మిట్ల లింక్ ను కొద్దికాలం వాయిదా వేస్తున్నట్లు మానవ వనరుల శాఖ స్పష్టత ఇచ్చింది. తదుపరి ఉత్తర్వ్యులు వచ్చే వరకు శాలరీ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్లతో సంబంధం లేకుండానే యాజమాన్యాలు కొత్త వర్క్ పర్మిట్లతో పాటు వర్క్ పర్మిట్ల బదిలీ, రెన్యూవల్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..