కన్నడ వాసులకు క్షమాపణలు చెప్పిన సెర్చ్ ఇంజన్…
- June 04, 2021
భారత్‌లో అత్యంత చెడ్డభాష ఏంటి అని గూగుల్‌లో టైప్‌చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపించడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని,అలాంటి ప్రాచీన భాషను చెడ్డభాషగా చూపించడం తగదని,దీనిపై న్యాయపోరాటం చేస్తామని కర్నాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబావళి పేర్కొన్నారు.సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు నోటీసులు జారీ చేస్తామని కన్నడ అధికారులు చెబుతున్నారు.సామాన్యుల నుంచి కన్నడ స్టార్స్ వరకు గూగుల్ తప్పిదంపై మండిపడుతున్నారు.వెంటనే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.జరిగిన పొరపాటును గుర్తించిన గూగుల్ వెంటన్ క్షమాపణలు చెప్పింది. కావాలని చేసింది కాదనీ,సెర్చ్ ఇంజన్ పొరపాటుగా గుర్తించాలని, కన్నడ భాషలోనే గూగుల్ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!







