కోవిడ్ టెస్టుల ధరలపై పర్యవేక్షించనున్న సీపీఏ
- June 04, 2021
ఒమన్: కోవిడ్ 19 టెస్టులకు సంబంధించి అడ్డగోలు ఛార్జీలకు ఆస్కారం లేకుండా ఒమన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ టెస్టు ధరలను తాము పర్యవేక్షించనున్నట్లు వినియోగదారుల భద్రత అధికార విభాగం కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వెల్లడించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు అనుమతి పొందిన ప్రైవేట్ ఆత్రులన్ని వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా టెస్ట్ ఛార్జీలను తీసుకోవాలని సీపీఏ సూచించింది. టెస్ట్ ఛార్జీలపై తమ పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించింది. మహమ్మారితో పోరాడుతున్న ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో ఛార్జీల పేరుతో ప్రజలను దోపిడి చేయకుండా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిత్వ తీర్మానం 16/2021 మేరకు ప్రభుత్వం సూచించిన ధరలకు మించి ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన